(సాక్షి డిజిటల్ న్యూస్) 28 నవంబర్ 2025 కల్లూరు
మున్సిపాలిటీ ప్రతినిధి సురేష్: ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన టియుడబ్ల్యూజే ఐజేయు విలేకర్ల ముఖ్య సమావేశంలో కల్లూరుకి చెందిన ప్రముఖ పత్రిక సీనియర్ రిపోర్టర్ ధర్నాశి బాలరాజును జిల్లా కమిటీలో సహాయ కార్యదర్శిగా విలేకరులపై దాడుల నివారణ కమిటీలో సభ్యునిగా స్థానం సంపాదించుకున్నందుకు గురువారం మండలంలోని విలేకరులతోపాటు కొంతమంది ప్రముఖులు శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చే పట్టాలని తన పనితీరుతో ఇంకా మరెన్నో మంచి పదవులు దక్కించుకోవాలని కోరారు. అనంతరం ధర్నాశి బాలరాజు మాట్లాడుతూ కత్తి మీద సాము లాంటి విలేకరీ వృత్తిలో బ్యాలెన్స్ గా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా పనిచేస్తున్న రిపోర్టర్లకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని శృతిమించినప్పుడు జిల్లా కమిటీ తో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విలేకరులకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు ఇతర పత్రిక, మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు.