Header Banner

ఆస్తి కోసం ఇంతగా దిగజారాలా.. చీ..చీ తల్లి కోసం పేర్చిన చితపై పడుకొని.. దారుణం (వీడియో చూడండి)

సాక్షి డిజిటల్ న్యూస్:- రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో చోటుచేసుకున్న దారుణమైనసంఘటన మానవత్వాన్ని మంటకలిసేలా చేసింది. షాపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని లీలా కా బాస్ గ్రామంలో ఓ వృద్ధ మహిళ (80) మరణించగా, ఆమె అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థుల సమక్షంలో మృతదేహాన్ని ఊరేగింపుగా చితివద్దకు తీసుకొచ్చిన సమయంలో, ఆమె ఇద్దరు కుమారులు అంత్యక్రియల సమయంలో ఘర్షణకు దిగారు. కారణం.. తల్లి చేతిలో ఉన్న వెండి కంకణం. ఇద్దరు సోదరుల మధ్య కంకణం కోసం మాటల యుద్ధం పెరిగి, చిన్న కొడుకు ఏకంగా తల్లి మృతదేహం ఉంచిన చితిపైనే పడకున్నాడు. “ఈ కంకణం నాకు కావాలి, అది ఇవ్వకపోతే లేచేది లేదు, అంత్యక్రియలు జరగవు” అంటూ అలజడి సృష్టించాడు. ఈ దృశ్యాన్ని అక్కడి వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. తల్లికి తుది వీడ్కోలు చెప్పే సమయంలో కూడా ఆస్తిపై ఇలా గొడవ పడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “తల్లిని మరిచి, చితిపై కూడా ఆభరణాల కోసమే మరిచిపోయారా?” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వృద్ధ తల్లికి కనీస గౌరవం ఇవ్వకుండా, ఆస్తి కోసం ఇంతకీ దిగజారతారా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఈ సంఘటన మానవ సంబంధాల పరస్పర విలువలు ఏ రీతిగా దిగజారిపోయాయో స్పష్టంగా చూపిస్తున్న ఉదాహరణగా నిలిచింది.