మెగా హీరోల వరుస ప్రాజెక్టులతో టాప్ దర్శకుడు నిమగ్నం—ఇతరుల‌కు అవకాశం దూరం?

సాక్షి డిజిటల్ న్యూస్ :టాలీవుడ్ ఇప్పుడు భారతీయ సినిమాలో అతి పెద్ద శక్తిగా మారింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ పాన్-ఇండియా విజయాలు కేవలం నటీనటులకే కాదు, దర్శకులకూ భారీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ వర్మ, నాగ అశ్విన్ వంటి దర్శకుల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రాండ్‌లా మారింది.వారి స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ బ్రిలియన్స్, భారీ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తెలుగు దర్శకులు ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్‌లో ఉన్న టాలెంట్‌గా ఎదిగారు. స్టార్​ హీరోల సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లో ఒక డైరెక్టర్ డైరీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ డైరీలో మెగా ఫ్యామిలీ హీరోల పేర్లతో మాత్రమే 2030 వరకు దాదాపు పదేళ్ల షెడ్యూల్ ఇప్పటికే లాక్ అయిపోయింది. ఒక్కో ప్రాజెక్ట్ మధ్య రెండు నుంచి మూడేళ్ల గ్యాప్‌తో, ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ టెంప్లేట్‌ను అనుసరిస్తూ, ఈ దర్శకుడు మెగా ఫ్యామిలీతో దీర్ఘకాలిక బాండ్ ఏర్పరచుకున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్​? లెక్కల మాస్టారుగా పేరుగాంచిన దర్శకుడు సుకుమార్​.2018లో రామ్ చరణ్‌తో మొదలైన సుక్కు-మెగా బంధం రంగస్థలం ద్వారా పాన్-ఇండియా గుర్తింపు సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో పుష్ప: ది రైజ్ (2021), పుష్ప 2: ది రూల్ (2024) సిరీస్ ద్వారా భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు మూడు కొత్త ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. రామ్ చరణ్‌తో కొత్త చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, రంగస్థలం కంటే భారీ స్థాయిలో తెరకెక్కనుంది. అల్లు అర్జున్‌తో పుష్ప 3: రాంపేజ్ 2027లో షూటింగ్ ప్రారంభం, స్టోరీ రెడీ అయ్యిందని టాక్​. అల్లు అర్జున్‌తో మరో ఒరిజినల్ స్క్రిప్ట్ పుష్ప సిరీస్ తర్వాత వరుసగా రెండో ప్రాజెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, ‘సుకుమార్​ డైరీలో మెగా హీరోల ప్రాజెక్టులు దాదాపు పదేళ్ల పాటు లాక్ అయ్యాయి. ప్రతి స్క్రిప్ట్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది’ అని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఐదేళ్లు మెగా అభిమానులు వరుస విజయాలు సెలబ్రేట్​ చేసుకునేందుకు రెడీ అయిపోవచ్చన్నమాట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *