“అర్హత లేదని కారు ఎక్కనివ్వలేదు” – ఇప్పుడు అమ్మకు బెంజ్ గిఫ్ట్!

సాక్షి డిజిటల్ న్యూస్ :సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో సీత పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత ఆమె చాలా మందికి క్రష్ గా మారిపోయింది. మొదటగా సీరియల్స్ నుంచి వచ్చిన ఈ అమ్మడును సినిమాలోకి తీసుకోవడానికి చాలా మంది వెనుకాడారు. కానీ, తన ప్రతిభతో సమాధానం చెప్పేసింది. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు ఖరీదైన కారు తీసుకుంది.ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “నేను చాలా పేదరికంలో పుట్టాను. నన్ను పెంచేందుకు, కుటుంబాన్ని నడిపించేందుకు మా అమ్మ చాలా కష్టపడింది. ఆర్థిక సమస్యలు చాలా ఉండేవి. అవన్నీ తట్టుకొని అమ్మ మమ్మల్ని పెంచింది. మా బంధువులు కూడా మమ్మల్ని చిన్నచూపు చూసేవారు. అవమానించేవారు. కనీసం మా అమ్మను కారు ఎక్కనిచ్చే వారు కాదు. ఆ అర్హత నీకు లేదు అనేవారు. ఒకసారి మా అమ్మను రోడ్ మీద వదిలేసి వెళ్లిపోయారు. ఆ సంఘటన నన్ను చాలా కలచివేసింది. అప్పుడే అనుకున్నాను.. డబ్బు సంపాదించాలని. ఖరీదైన కారులో అమ్మను తిప్పాలని. ఆనాటి కల ఇప్పుడు నెరవేరింది. మా అమ్మను అవమానించిన వాళ్లలో ఎవరికీ లేని బెంజ్‌ కారు అమ్మకోసం కొన్నాను” అంటూ రాసుకొచ్చింది మృణాల్. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు చాలా గ్రేట్ మృణాల్ అంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ అమ్మడు హీరో అడివి శేష్ తో డెకాయిట్ సినిమా చేస్తోంది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది మృణాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *