సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీలో మరోసారి గంజాయి మాఫియా దాడులకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య మర్డర్ కేసుల వేట సాగిస్తున్న పోలీసులపై గంజాయి మాఫియా కత్తులతో దాడులకు తెగబడుతోంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన హత్య కేసులోని నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. కల్లూరుపల్లి హోసింగ్ బోర్డ్‌లో పెంచలయ్యని హత్య చేసిన నిందితులుగా అనుమానిస్తున్నారు.అయితే షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులపై కత్తితో నిందితులు దాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలయ్యాయి. దీంతో నిందితులుపై పోలీసులు కాల్పులు జరిపారు. జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయాలవ్వగా.. మరో 9 మంది నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ మాఫియా దాడుల్లో గాయపడిన నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణకు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గంజాయి మాఫియాని ఎన్ కౌంటర్ చేయాలని పబ్లిక్ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, ఆగస్టు 2025లో గంజాయి స్మగ్లర్ పోలీసులను కారుతో ఢీకొట్టగా.. ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. ఇందులో స్మగ్లర్‌ను పట్టుకోవడానికి సీఐ కాల్పులు జరపాల్సి వచ్చింది. చివరకు అతన్ని అరెస్టు చేసి, 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆగస్టు 2024లో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును గంజాయి మాఫియా సభ్యులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఈ ప్రమాదంలో డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి.ఇటీవల నవంబర్ 2025లో గంజాయి వాడకానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యను గంజాయి ముఠా కత్తులతో వెంటపడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇందులో భాగంగానే నకిలీ కరెన్సీ చెలామణి చేస్తూ ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ఓ గంజాయి మాఫియాను పోలీసులు అరెస్ట్ చేశారు.