Header Banner

కోకాపేట భూములు.. వేలంలో చరిత్ర సృష్టించిన ధరలు!

సాక్షి డిజిటల్ న్యూస్ :హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు నెలకొల్పింది. వారం రోజుల వ్యవధిలోనే మునుపటి ధరలను అధిగమించడం విశేషం. ఈ నెల 24వ తేదీన జరిగిన వేలంలో ప్లాట్ నంబర్ 17లో ఎకరం రూ. 136.50 కోట్లు, ప్లాట్ నంబర్ 10లో ఎకరం రూ. 137.25 కోట్లు పలికాయి. అయితే, తాజాగా జరిగిన వేలంలో ఈ రికార్డులు బద్దలయ్యాయి.