సాక్షి డిజిటల్ న్యూస్ :బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న కాజోల్.. ఇప్పుడు సినిమాలు దాదాపు తగ్గించేసింది. కానీ ఆమె బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖాళీ కావడం లేదు… బదులుగా ప్రతి నెలా లక్షల రూపాయలు జమ అవుతూనే ఉన్నాయి. అది కూడా ఏం చేయకుండానే. హీరోయిన్ కాజోల్కు ముంబయిలో బ్యాంక్ స్ట్రీట్ పక్కనే భారీ కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. ఆ భవనంలోని రిటైల్ స్పేస్‌ను భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌కు రెంట్‌కు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం 9 ఏళ్లలో ఆమెకు మొత్తం 8.6 కోట్ల రూపాయలు వస్తాయి… అంటే సగటున ప్రతి నెలా సుమారు 6.9 లక్ష రూపాయలు! ఒక్క రోజు కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు, కెమెరా ముందు నటించాల్సిన అవసరం లేదు, ఎడిటర్‌తో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ, బ్యాంక్ నుంచి వచ్చే SMSలు చూస్తూ ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టేయడమే. కాజోల్ పని బాగుంది కదూ..!