Header Banner

ఏఐసీసీ ఆధ్వర్యంలో బాలరాజుకు ఘన సన్మానం.

(సాక్షి డిజిటల్ న్యూస్) 29నవంబర్ 2025

కల్లూరు మున్సిపాలిటీ ప్రతినిధి సురేష్: అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి.ఏనోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు ధర్నాసి బాలరాజు ను ఘనంగా సన్మానించారు.టియుడబ్ల్యూజే (ఐజేయు) తెలంగాణ రాష్ట్ర, ఖమ్మం జిల్లా కమిటీ వారు ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ ధర్నాసి బాలరాజును ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ జిల్లా సభ్యునిగా నియమించడంతో టీజీఎం చర్చ నందు ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఏనోష్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజ్,మండల అధ్యక్షులు ఎబినేజర్, దయాకర్, జాన్ పరంజ్యోతి, కొత్తపల్లి మెషేక్, పాస్టర్స్ పాల్గొన్నారు.