Header Banner

మండల వ్యాప్తంగా మొత్తం 180 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 30, మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య :మల్లాపూర్ మండలం వ్యాప్తంగా వివిధ గ్రామాలలో మొత్తం 180 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేసినట్టు ఎంపీడీవో శ్రీకాంత్ తెలిపారు. 23 గ్రామపంచాయతీలకు ఏర్పాటుచేసిన ఏడు నామినేషన్ సెంటర్లలో మొత్తం 180 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 23 గ్రామపంచాయతీలకు 220 వార్డులకు మొత్తం 474 వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. చివరి రోజు రాత్రి వరకు నామినేషన్లు వేయడంతో పెరిగాయి.