సాక్షి డిజిటల్ న్యూస్ : రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం రాయ్‌పుర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సోమవారం సాయంత్రం రాయ్‌పురకు చేరుకున్నాయి.పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. అతడు హోటల్ లోపలికి వెళ్లేటప్పుడు ఎంతో మంది చిన్నారులు అతడిని చట్టు ముట్టారు. గులాబీలతో కోహ్లీకి స్వాగతం చెప్పారు. ఇక కింగ్ కోహ్లీ కూడా వారు ఇచ్చిన గులాబీలను తీసుకుని నవ్వుతూ ముందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాంచి మ్యాచ్‌లో కోహ్లీ 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ సెంచరీ కావడం విశేషం.