చంద్రబాబుకు భారీ ఊరట: లిక్కర్ కేసు అధికారికంగా మూసివేత!

సాక్షి డిజిటల్ న్యూస్ :

సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. చంద్రబాబుపై నమోదైన లిక్కర్ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లుగా సీఐడీ అధికారు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోర్టు, సీఐడీ నివేదిక ఆధారంగా.. ఈ లిక్కర్ కేసును మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ప్రభుత్వహయాంలో రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఈ కేసులు నమోదు చేశారని మొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. చివరికి సీఐడీ దర్యాప్తు సంస్థే ఆధారాలు లేవని నిర్ధారించడంతో.. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన సమయంలో.. గత ప్రభుత్వం కుట్రపూరితంగా  కేసుల భారం తొలగిపోవడం ఆయనకు పాలనలకు మరింత బలాన్ని సమకూర్చింది. ఈ కేసుల మూసివేత్తతో రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచే అంశంగానూ పరిగణించవచ్చు. అలాగే ఇటీవల చంద్రబాబుపై నమోదైన మరో కేసులో కూడా ఊరట లభించిన విషయం తెలసిందే. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ నెట్‌ ఏర్పాటులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు కూడా మూసివేశారు. లిక్కర్ కేసు, ఫైబర్ నెట్‌ కేసుల్లో మూసివేయబడటం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నమోదైన కేసుల పట్ల ఎలాంటి నిజాలు లేవని, కేవలం ఈ కేసులు ఆరోపణలతో నమోదైన కేసు కావడంతో.. ఈ కేసులను కోర్టు క్లోజ్ చేశాయి. ఈ కీలక పరిణామాలు, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో అధికార పక్షానికి మరింత బలాన్ని, అలాగే ప్రతిపక్షాలకు విమర్శలకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *