సాక్షి డిజిటల్ న్యూస్ : దేశవ్యాప్తంగా కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇవాళ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బయల్దేరిన 30కి విమానాలు, శంషాబాద్‌లో 33 విమానాలు, ముంబైలో అనేక సేవలు రద్దు అయ్యాయి. మొత్తంగా దాదాపు ఇవాళ (గురువారం)170 కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. నిన్న (బుధవారం) మాత్రమే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మొత్తం కలిసి 200 విమానాలు రద్దయ్యాయి. ప్రతి రోజు సుమారు 2,200 ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ కార్యకలాపాలు గణనీయంగా అంతరాయాలను ఎదుర్కొంటుందని ఆ సంస్థ అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, సాంకేతిక లోపాలు, అననుకూల వాతావరణం, దేశవ్యాప్త వైమానిక రద్దీ, కొత్తగా అమలు చేసిన FDTL నిబంధనలు కలిపి ప్రతికూల ప్రభావం చూపాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే ‘తాత్కాలికంగా షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తున్నామని, వచ్చే 48 గంటల్లో కార్యకలాపాలు సాధరణ స్థాయిలోకి వస్తాయని ఇండిగో ప్రకటించింది.ఇండిగోలో గందరగోళానికి ముఖ్య కారణంగా .. 90 దేశీయ, 40 అంతర్జాతీయ మార్గాల్లో సేవలందిస్తున్న విమానాయన సంస్థ పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతుంది. నవంబర్‌లో అమల్లోకి వచ్చిన కొత్త FDTL నిబంధనల ప్రకారం.. పైలట్లకు .వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి, రాత్రి పని సమయం పెంపు, అలాగే రాత్రి తక్కువ ల్యాండింగ్‌లు. ఈ నిబంధనలు విమానాల సంఖ్య ప్రభావితమవుతుంది. దీనిపై దేశీయ ఎయిర్‌లైన్స్ ఎదురు తిరిగింది.. కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు.. డీజీసీఏ రెండు దశలుగా అమలు చేసింది.