ఉద్యోగాల్లో తెలుగు ప్రాధాన్యంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ :మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో నిర్వహించిన కృష్ణా తరంగ్ 2025 ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉంటుంది. అది ప్రాంతీయ భాషనే కావచ్చు.. అలాగే ఆంగ్లం అయి ఉండవొచ్చు. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెంగు భాషను ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని కోరారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పని సరిగా తెలుగు వచ్చిఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. ముఖ్యంగా  తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన రామోజీరావు జయంతిలో పాల్గొని తెలుగు భాష గురించి వివరించారు.  తెలుగు భాషలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరినట్లు ఆయన తెలిపారు. స్పందించిన సీఎంలు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మనం తెలుగు నెలపై జన్మించిన వాళ్లం కాబట్టి తెలుగును పరిపాలన భాషగా చేయాలని విన్నవించారు. అదేవిధంగా మెడికల్, ఇంజినీరింగ్ బోధన తెలుగు భాషలోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొంత మంది ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. కానీ పేపర్ మీద రాసుకుని మాట్లాడతారు. అలా ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అని భావిస్తున్నారు. కానీ మన తెలుగ భాష మాట్లాడితే మధురంగా ఉంటుందన్నారు. ప్రతీ మన మాతృమూర్తి భాష అయిన తెలుగును మాట్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *