మండలంలో శరవేగంగా రెండవ రోజు నామినేషన్లు

(సాక్షి డిజిటల్ న్యూస్) 5 డిసెంబర్ 2025 కల్లూరు మండల ప్రతినిది సురేష్:-

కల్లూరు మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో స్థానిక ఎన్నికల సందర్భంగామండలంలోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఫ్యానెల్ వార్డు సభ్యులతో కలసి భారీ ర్యాలీతో పండుగ వాతావరణాన్ని తలపించేలా సర్పంచులు వార్డు మెంబర్లు నామినేషన్ ప్రక్రియ జోరుగా కోనసాగింది. గురువారం కల్లూరు మండల పరిధిలోని పోచారం గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రంలో పోచారం టిఆర్ఎస్ పార్టీ సర్పంచి అభ్యర్థిగా కట్ట ధనమ్మ ,మర్లపాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచిగా బండి వీరబాబు, చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ సర్పంచిగా యాస భాగ్యలక్ష్మి, యజ్ఞ నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచిగా కంచ పోగు సుజాత, పేరువంచ కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థులుగా కీసరి మోహన్ రెడ్డి, కీసరి మధుసూదన రెడ్డి, పేరువంచ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండపల్లి వాసు, పేరువంచ బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంకిరెడ్డి వెంకట్రెడ్డి, ముగ్గు వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రావి పాపారావు, పెద్ద కోరుకొండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మాదిరాజు శైలజ, టిఆర్ఎస్ పార్టీ పెద్ద కోరుకొండి సర్పంచి అభ్యర్థిగా మచ్చ పద్మావతి, వివిధ పార్టీల సర్పంచులు రెండవ రోజు నామినేషన్లు భారీ ర్యాలీలతోనూ తమ ప్యానెల్ వార్డు సభ్యులతో కలిసి నామినేషన్లు వేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *