ఎంత ముద్దుగా ఉన్నారో! స్కూల్‌కు వెళ్లే చిన్నారిని ఆపకుండా వెంట నడిచిన బేబీ ఏనుగు!

సాక్షి డిజిటల్ న్యూస్ :సాధారణంగా జనాలు, కుక్కలు, పిల్లులు వంటి పెట్స్‌ను పెంచుకొని వాటితో ఆడుకుంటూ ఉంటారు. కానీ చూడ్డానికి భారీగా కనిపించినా.. ఏనుగులు కూడా మానవులతో చాలా స్నేహంగా, ప్రేమగా మెలుగుతాయి. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అవి మనపై ఎనలేని ప్రేమను కురిపిస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వైరల్ వీడియోలో.. స్కూల్‌కు వెళ్తున్న ఒక బాలిక వెంట ఏనుగు వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ చిన్నారి ఏనుగుతో పాటు సరదాగా ఆడుకుంటూ స్కూల్‌కు వెళ్తుంది.ఆ ఏనుగు ఆ బాలిక వెంటనే సరదాగా వెళ్లట్లేదు.. ఆ బాలికకు రక్షణగా, తోడుగా ఏనుగు ఆమెతో పాటు స్కూల్‌కు వెళ్తొంది. ఆ ఏనుగు, చిన్నారి మధ్య ఉన్న స్వచ్చమైన స్నేహ బంధం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో ఈ వీడియో ఇప్పటి వరకు 60వేలకుపైగా వీవ్స్‌ను సాధించింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల కంటే ఇలాంటి అమాయక జంతువులతో స్నేహం చేయడమే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ఇది చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో అంటూ రాసుకొచ్చాడు. నేను కూడా ఈ ఏనుగుతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *