సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో అవార్డు లభించింది. ఆయనకు తొలి ఫిఫా శాంతి బహుమతి వరించింది. వాషింగ్టన్ డీసీలోని కెన్నెడీ సెంటర్‌లో 2026 ఫిఫా ప్రపంచ కప్ డ్రా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే ట్రంప్‌నకు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్పాంటినో తొలి ఫిఫా శాంతి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఫిఫా వరల్డ్ కప్ 2026 ట్రోఫీని ఆవిష్కరించారు. అయితే ఈ 2026 ఫిఫా ప్రపంచ కప్ డ్రా అనూహ్యమైన రాజకీయ రూపాన్ని తీసుకుంది. ఈ ఏడాది నుంచే తొలి పిఫా శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నవంబర్ 5వ తేదీన ఫిఫా ప్రకటించింది. ఈ కారణంగా ప్రపంచాన్ని ఫుట్ బాల్ ఏకం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ అవార్డును ప్రజెంట్ చేయడం ఫిఫాకు సైతం గుర్తింపు తీసుకురానుంది. ఈ అవార్డును ప్రధానంగా శాంతి నెలకొల్పే వారికి ఇవ్వనున్నారు. అలాగే ప్రపంచ శాంతి స్థాపనకు శ్రమించడంతో పాటు తన నిర్ణయాలతో ఏకం చేసే వారికి ఈ అవార్డు అందించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఫిఫా గౌరవాన్ని ఈ శాంతి బహుమతి పెంచడంతో పాటు సుమారు 500 కోట్ల మంది ఫుట్ బాల్ ఫ్యాన్స్ తరఫున ప్రెజెంట్ చేస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు తెలిపారు.