Header Banner

టేకాఫ్‌కు క్షణాల ముందు ఇండిగో విమానంలో పావురం కలకలం!

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇండియాలో ఇండిగో విమానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. వందలాది విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లోనే వేలాది మంది చిక్కుకున్నారు. ఇండిగో మీద ప్రయాణికులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలో ఓ పావురం ఇండిగో విమానంలోకి దూరి కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బెంగళూరు నుండి వడోదరకు వెళ్లే ఒక సాధారణ ఇండిగో విమానం టేకాఫ్‌కు ముందు క్యాబిన్‌లోకి ఒక పావురం ఎగిరడంతో అసాధారణ అంతరాయం కలిగింది. ఈ ఘటన ప్రయాణీకులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ పక్షి మాత్రం సీట్లపై ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.