Header Banner

NTR ఢిల్లీ హైకోర్టు వద్ద కేసు ఫైల్: కారణం షాక్!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. తన అనుమతి లేకుండా తన ఫోటోను కానీ.. పేరును కానీ ఎవరూ ఉపయోగించుకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టును రిక్వెస్ట్ చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లలో ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఎవరూ తన ఫోటోలు వాడొద్దని.. ఒకవేళ ఎవరైనా అలా వాడితే.. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశారు జారీ చేసింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది.