పాక్ పార్లమెంటులో గాడిద సంచలనం: నిజమా? ఏఐ మాయాజాలమా?

సాక్షి డిజిటల్ న్యూస్ :పాకిస్థాన్‌ పార్లమెంటులో ఒక వింత సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పార్లమెంటులోకి గాడద ఎంట్రీ ఇచ్చినట్లుగా ఉన్న ఆ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. పార్లమెంటు సభ్యుల కూర్చీల వద్దకు గాడిద దూసుకెళ్లి అలజడి రేపింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటకు తరిమేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు.పార్లమెంటులో గాడిద సభ్యుల కుర్చీల మీదకు దూసుకెళ్లింది. కొందరు ఎంపీలు తమ కుర్చీల నుంచి కింద పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. మరొకొందరు సభ్యలు నవ్వుకోవడం చూడొచ్చు. అయితే, ఆ వీడియో నిజమైనదా? లేక ఏఐతో తయారు చేసిందా? అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.ఏఐ వచ్చాక ఏది నిజమో.. ఏది అబద్దమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి వీడియోలు తయారు చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. పాకిస్తాన్‌ పార్లమెంటులోకి గాడిద ప్రవేశించిన వీడియో ఒరిజినలా.. లేక ఏఐ సృష్టినా అనేది తేల్చుకోలేని పరిస్థితి. ఏఐతో తయారు చేసిన ఫొటోలు, వీడియోలు వాస్తవానికి దగ్గరగా ఉంటుండటమే ఇందుకు కారణం. 10 సెకన్ల ఆ వీడియోపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్‌ అవుతున్నారు. కొంతమంది అది ఏఐతో తయారు చేసిన రియలస్టిక్ వీడియో అంటున్నారు. మరికొంత మంది పాకిస్థాన్ పార్లమెంట్‌లో అది నిజంగానే జరిగిందని అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *