సాక్షి డిజిటల్ న్యూస్ : నార్వేలోని ఓస్లోలో డిసెంబర్ 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతి ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ నోబెల్ బహుమతి అందుకునేందుకు నోబెల్ గ్రహీత మచాడో వెళ్తే.. తనను దేశం నుంచి బహిష్కరించనున్నట్లు ఆ దేశ అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తన కూతురు నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. ప్రజలతో పాటు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఆమెకు నోబెల్ బహుమతి వరించింది. అయినా దేశం విడిచి వెళ్లలేని పరిస్థి నెలకొంది. ఇదిలా ఉండగా, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారా కొరినా మచాడో 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి బయట కనిపించారు. తన కూతురు నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఓస్లోకు వచ్చారు. 2014 నుంచి మదురో ప్రభుత్వం విధించిన ప్రయాణ నిషేధాన్ని ఆమె ధిక్కరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులరాలు నార్వే వెళ్తే.. ఆమెను పారిపోయిన మహిళగా గుర్తిస్తామని చెప్పారు.అయితే, వాస్తవానికి నెలల తరబడి అజ్ఞాతంలో ఉంటున్న మచాడో.. నోబెల్ శాంతి బహుమతిని స్వయంగా స్వీకరించడానికి నార్వేకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆమె దేశం దాటితే ఆమెను బహిష్కరిస్తానే కారణంతో కుమార్తె అనా కొరినా సోసా అవార్డును స్వీకరించడానికి ముందుకొచ్చింది. అయితే వీడియో ద్వారా తన తల్లి మచోడా సందేశం తెలిపారు. ఈ నోబెల్ బహుమతి వెనిజులా ప్రజలది అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.