లోకానికి నిజమైన వెలుగు క్రీస్తే: డాక్టర్ జాన్ వెస్లీ* *మున్సిపాలిటీ పరిధిలో అత్యంత ఘనంగా ఐక్య క్రిస్మస్ వేడుకలు.

(సాక్షి డిజిటల్ న్యూస్)10 డిసెంబర్ 2025 కల్లూరు మండల ప్రతినిది సురేష్

లోకానికి నిజమైన వెలుగు యేసుక్రీస్తేనని ఐక్య క్రిస్మస్ సంబరాలలో అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్ జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణములో చండ్రుపట్ల రోడ్డులో గల లక్కినేని గ్రౌండ్ నందు ఇండిపెండెంట్ అసోసియేషన్ క్రిస్టియన్ కమిటీ మండల అధ్యక్షులు ఎబినేజర్ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఐక్య క్రిస్మస్ వార్తమానికులు గా డాక్టర్ జాన్ వెస్లీ, విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సంబరాలను ఉద్దేశించి డాక్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించుటని క్రిస్మస్ కు చారిత్రాత్మక ఆధారం ఉందని అన్నారు. క్రీస్తు ప్రభువు పశువుల పాకలో జన్మించిన సమయంలో పరలోకము నుండి దేవదూతల సమూహము భూమి మీదకు ఏతెంచి క్రీస్తు ప్రభువుని మహిమ పరిచిన సమయంనే మొట్టమొదట క్రిస్మస్ జరిగిందని తెలిపారు. క్రీస్తు ప్రభువు నిజమైన లోకరక్షకుడని విశ్వసించి హృదయాలలో చేర్చుకున్న వారి జీవితంలో జరిగించిన ఆరాధనే క్రిస్మస్ అన్నారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకువచ్చి వారి జీవితాలు మార్చే మార్గమే క్రైస్తవ మార్గము అన్నారు. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగని, చారిత్రాత్మకంగా చేసే పండుగని, ఇది ఆధ్యాత్మికమైన పండుగని, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించే పండుగని ఆయన కొనియాడారు. చలిని సైతం లెక్కచేయకుండా దైవ వర్తమానాన్ని వినడానికి వివిధ గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు మాట్లాడుతూ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎదుటివారిని ప్రేమించాలని సర్వమత సారాంశం అదేనని అన్నారు. ఈనాడు సమాజంలో చిన్న పిల్లలను హింసించే పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మనం చూపించే ప్రేమే మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని తెలియజేశారు. క్రిస్మస్ సంబరాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. *క్రీస్తు ప్రేమ దయను విడిచి అనుసరించాలి* సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను, దయను, శాంతి, సమాధానమును అనుసరించాలని అసోసియేషన్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ అన్నారు. ఐక్య క్రిస్మస్ సంబరాలలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎఐసిసి మండల కమిటీ, క్రైస్తవ సేవకులు, గ్రామ పెద్దలు, అధికారులకు, అనాధికారులకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో ప్రతి సంవత్సరం ఐక్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్థలాన్ని ఇస్తున్న మాజీ జెడ్పిటిసి డాక్టర్ లక్కినేని రఘు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎఐసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రదర్ బాలరాజు మాట్లాడుతూ క్రైస్తవులకు ఎల్లవేళల అండగా ఉంటామని 2025 సంవత్సరములో ఎఐసిసి ద్వారా జరిగిన కార్యక్రమాల నివేదికను చదివి నివేదించారు. ఏఐసిసి ద్వారా జరుగుతున్న నిరవధిక కార్యక్రమాల కోసం అందరూ ప్రార్థన సహాయం అందించాలని కోరారు. అన్ని విషయాల్లో ప్రోత్సాహం అందిస్తున్న ఏ ఐ సి సి రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ సమాజం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సమాజానికి,ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేసే విధంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు కు అభినందనలు తెలిపారు. ఐక్య క్రిస్మస్ సంబరాలలో చిన్నారులతో ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చూపరులకు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ టీ నిర్మల్ కుమార్, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జల్దీ జైపాల్, ఐక్య క్రిస్మస్ నిర్వాహక కమిటీ సభ్యులు జాన్ పరంజ్యోతి, దయాకర్, సుందర్ రాజు, తిమోతి, రాజశేఖర్, జీవన్ కుమార్, మహేష్, థామస్, సమర్పన్ పాల్, దాసన్న, కెనడి రాజు, డాక్టర్ అచ్యుత రెడ్డి, జాక్ జిల్లా కమిటీ, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల సేవకులు వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *