సాక్షి డిజిటల్ న్యూస్ : త్రీ రోజెస్ వెబ్ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా, కిరణ్ దర్శకత్వంలో దీన్ని ఎస్‌కెఎన్ నిర్మించారు. ఇందులో ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషితా కల్లపు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో నాలుగు పతకాలను సాధించారు. ఈ సందర్బంగా ఈవెంట్‌లో నటి ప్రగతిని.. త్రీ రోజెస్ టీమ్ సత్కరించింది. ఈ సందర్భంగా.. నటి ప్రగతి మాట్లాడుతూ ‘‘సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తోందని అన్నారు. నిజానికి నేను సినిమాలు మానేయలేదు. ఎందుకంటే సినిమాలు లేకపోతే నేను బతకలేను. నా ఇంటి దగ్గర రెంట్ దగ్గర నుంచి కొనుక్కునే వరకు.. ఈరోజు తినే తిండి వరకు సినిమా ఇచ్చిందే. తుది శ్వాస వరకు సెట్‌లోనే ఉంటాను. చిన్న గ్యాప్ వచ్చిందంతే. నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ రావటం లేదు. మిస్ అండర్‌స్టాండింగ్‌తోనే ఆ గ్యాప్ కూడా వచ్చింది. తమిళంలో మళ్లీ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా విలన్‌గా. ఈలోపు ఎక్కడైనా లో అయిపోతాననే ఆలోచనతోనే పవర్ లిఫ్ట్ చేశాను. ఈరోజు దేశం జెండా పట్టుకుని సిల్వర్ మెడల్ తెచ్చాను. ఇదే ఎనర్జీ సినిమాలోని క్యారెక్టర్‌కు పడితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి.నేను పవర్‌లిఫ్ట్ స్టేజ్‌పై కూడా నా సినిమా ఫ్యామిలీనే రెఫర్ చేశాననే భావిస్తున్నాను. నేను పవర్‌లిఫ్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వయసులో నీకిది అవసరమా? అన్నారు. జిమ్‌కి జిమ్ బట్టలే వేసుకోవాలి. చీర కట్టుకునో, చుడీదార్ వేసుకునో చేయలేను. ఎదిగిన కూతురుందిగా నేనేమైనా తప్పు చేస్తున్నానా? అనే డౌట్ వచ్చింది. బాధపడ్డాను. అయితే ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా! అని అన్నాడో వాళ్లందరి ఈరోజు ఆన్సర్ వచ్చింది. ఇదే ఆన్సర్. ఏషియన్ గేమ్స్ వచ్చిన ఈ మెడల్‌ను సినీ ఇండస్ట్రీలోని లేడీ ఆర్టిస్టులందరికీ డెడికేట్ చేస్తున్నాను. అమ్మాయి ఓ ఫొటో పెట్టిందంటే.. ఓ మాట ఈజీగా అనేస్తారు.. ఈజీగా ఓ మాట రాసేస్తారు. ఇంట్లో వాళ్లకి ఓ ఫ్యామిలీ ఉంటుంది.. పిల్లలుంటారు. వాళ్లకి పరువుంటుంది. వాళ్లకి బాధ ఉంటుందని ఆలోచించరు. దయచేసి అలా చేయకండి. కామెంట్ చేసే ముందు మనింట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా.. దయచేసి ఆలోచించుకోండి ప్లీజ్. ఏదీ ఇవ్వకపోయినా.. కొంచెం మర్యాద ఇవ్వండి’’ అన్నారు.