సాక్షి డిజిటల్ న్యూస్ :సోమవారం దక్షిణ బ్రెజిల్‌ను తీవ్ర తుఫాను ముంచెత్తింది. దీంతో చాలా నగరాల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేల కూలాయి. అగానే గువైబా నగరంలో హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూడా ఈ గాలుల ధాటికి కుప్పకూలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బలమైన గాలుల వీయడంతో విగ్రహం మొదట కాస్తా వంగినట్టు కనిపించగా.. కాసేపలికే అది పూర్తిగా కూలిపోయింది.బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. ఇది అసలైన అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాదు, బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా ఉన్న 24 మీటర్ల ఎత్తైన ప్రతిరూపం. దీన్ని 2020లో ఏర్పాటు చేసిన విగ్రహం. దీన్ని 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ బేస్‌పై అమర్చారు. అయితే తుఫాన్ కారంణంగా నగరంలో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు విచాయని దానికి కాణంగానే ఈ విగ్రహం కూలిపోయినట్టు తెలిపారు. విగ్రహం కూలినా బేస్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.