34 ఓట్ల తేడాతో గుజ్జుల శ్రీనివాస రావు అశ్వరావుపేట ఇన్చార్జి బుల్లా శివ అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీలో నిన్న నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వతనేని వరప్రసాద్, మరియు సాయిల నరసింహారావు (నర్సి) ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుజ్జుల శ్రీనివాసరావు 34 వాట్ల తేడాతో ప్రత్యర్థులపై గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే గెలుపుకు కారణం: గుజ్జుల శ్రీనివాసరావు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన గ్రామ ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.