Header Banner

మురికినీటి కాలువలపై మూతలు వేయడం మరిచారా!

ప్రమాదకరంగా మారిన మురికి నీటి కాలువలు

సాక్షి డిజిటల్ న్యూస్ 16 డిసెంబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత రెండేళ్ల క్రితం మసీదు వీధి, సాలె వీధి, సిద్ధారెడ్డి గారి పల్లి లలో మురికినీటి కాలువలు నిర్మించారు. అయితే ఆ కాలవలకు మూతలు వేయకపోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాలువల్లో ప్రవహించే మురుగునీటి వాసన భరించలేక ప్రజలు మూసుకొని పోవాల్సి వస్తోంది. ఈ మధ్యకాలంలో పలువురు ఈ మురికి నీటి కాలువలో పడి గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి. గత మూడు మాసాల క్రితం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, అప్పటి ఎంపీడీవో థామస్ రాజా లు మూతలు వేయడానికి ఇచ్చిన ఆదేశాలు ఫలించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మూతలు వేయకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.