సాక్షి డిజిటల్ డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత పది సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాను. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం, మీ నాయకత్వమే. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అభివృద్ధి చేయని మీరు, నాపై విమర్శలు చేయడం సరికాదు. ప్రజల తీర్పే మీ రాజకీయ వైఫల్యానికి సమాధానం.