Header Banner

జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన ఎన్నికయినా గ్రామ సర్పంచ్ ల ను సన్మానం చేసిన మంత్రి అడ్లూరి

సాక్షి డిజిటల్ డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పొన్నాల గార్డెన్స్‌లో నూతనంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోఎన్నికైన జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్‌లను సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్‌లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, గ్రామ స్థాయి పాలన బలపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చాలని మంత్రి గారు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఎప్పుడూ నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రజల అవసరాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపడమే పార్టీ విధానమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.