Header Banner

పోలింగ్ గ్రామాల్లో 163 BNSS అమలు

సాక్షి డిజిటల్ డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ధర్మపురి మండలంలో రేపు నిర్వహించనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే గ్రామాల్లో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై మహేష్ తెలిపారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఓటర్లు బాధ్యతయుతంగా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.