Header Banner

నా వల్ల కాంగ్రెస్ కు, జీవన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తే అర్థగంటలో రాజీనామా చేస్తా -జగిత్యాల డిసిసి అధ్యక్షుడు గజంగి నందయ్య

సాక్షి డిజిటల్ డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ,
సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిసిసి అధ్యక్షుడు నందయ్య నిలదీసిన జీవన్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే సంజయ్ తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమంలో పాల్గొనడం పై అసంతృప్తి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో డిసిసి అధ్యక్షుడిని ప్రశ్నించిన జీవన్ రెడ్డి వర్గం, దీంతో డిసిసి అధ్యక్షుడు నందయ్య ఘాటు వాఖ్యలు యువజన కాంగ్రెస్ నాయకులు నాపై నమ్మకం ఉంచాలి, ఇంకా నాకు ప్రొఫెషన్ పీరియడ్ నడుస్తుంది, నావల్ల జగిత్యాల కాంగ్రెస్కు లేదా జీవన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా, అధ్యక్ష పదవి కోసం కకృతి పడటం లేదు, రాజీనామా పత్రం జేబులోనే ఉంది, నా పదవి జీవన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అయినకు నందయ్య అంటే నమ్మిన బంటు అనే పేరు ఉంది, లూజ్ కామెంట్స్ చేయొద్దు, ఇష్టం లేకపోతే ఇదే స్టేజిపై రాజీనామా చేసి వెళ్తా, జీవన్ రెడ్డి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళను, ఈ పదవి ఉన్నా ఒకటే పోయిన ఒకటే అని హాట్ కామెంట్స్ చేశాడు.