Header Banner

పిల్లాడికంటే ముందే మాటలు నేర్చుకున్న పెట్‌డాగ్

సాక్షి డిజిటల్ న్యూస్ :కుక్కల్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తుంటారు. ఒంటరిగా జీవించే చాలా మంది కూడా తమకు తోడుగా కుక్కల్ని ప్రేమగా పెంచుకుంటారు. మరికొంతమంది తమ కుటుంబంలో వాటిని ఒక సభ్యుడిగా భావిస్తూ సాకుతుంటారు. మనుషులకు కుక్కల​ంటే ఎంతో ప్రేమ. అయితే అవి కూడా కొన్ని సార్లు తమ క్యూట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే తమ ధైర్యసాహసాలతో ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క చేసిన పనికి సోషల్‌ మీడియా మురిసిపోయింది.ఒక చిన్న పిల్లవాడు, వారి పెంపుడు కుక్క కలిసి కూర్చుని ఉన్నట్లు చూడొచ్చు. తల్లిదండ్రులు తమ బిడ్డకు “మమ్మా” అని చెప్పడం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లవాడు వెంటనే “మమ్మా” అని చెప్పడం ప్రారంభిస్తాడని ఆశిస్తూ, వారు పిల్లవాడి ముందు ఆహార ఉంచుతారు. కానీ ఆ తర్వాత కుటుంబాన్ని కూడా ఆశ్చర్యపరిచేలా పక్కనే ఉన్న పెంపుడు కుక్క బిగ్గరగా “మమ్మా” అని అరుస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.