“స్నేక్ రాజు నాగిని పాటకు తన ప్రత్యేకమైన స్టెప్పులతో ఆకట్టుకున్న అరుదైన వీడియో”

సాక్షి డిజిటల్ న్యూస్ :సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వాటిలో జంతువులకు సంబంధించనవి బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. వీటికి సోషల్ మీడియాలో భారీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అంటే నెటిజన్లు పాము వీడియోలపై చాలా ఆసక్తి చూపుతున్నారు.. కింగ్ కోబ్రాతోపాటు పలు రకాల పాముల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా చూస్తుంటారు. తాజాగా.. ఓ పాము డ్యాన్స్ నెట్టింట షేక్ చేస్తోంది.. నాగిని పాటకు పాము డ్యాన్స్ చేస్తున్న సర్‌ప్రైజింగ్ వీడియో వైరల్ అవుతోంది.. దానిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.నాగిని పాటకు పాము డ్యాన్స్ చేడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అవును.. మీరు విన్నది నిజమే.. సినిమాల్లో తరచుగా వినిపించే ఫ్లూట్ శబ్దం విన్న తర్వాత పాములు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాయి.. ఇది రీల్.. అయితే. ఇక్కడ నిజంగానే జరిగింది.. ఇలాంటి ది నిజ జీవితంలో దీనిని చూసిన వారు చాలా తక్కువ.. అయితే.. బీహార్‌కు చెందిన ఒక బాలుడు నాగిన్ పాటను తన ఫోన్‌లో పెట్టినప్పుడు, పాము ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ వీడియో పాతదే కానీ.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో, నాగిని ట్యూన్ ప్లే అవ్వడం ప్రారంభించిన వెంటనే పాము నేలపై పాకడం ప్రారంభించడాన్ని చూడవచ్చు. దీని తరువాత, పాము వింతగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా, పాము తన నోరు చాచి నేలపై దొర్లుతుంది. పాము ఇలా నృత్యం చేయడం అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది.అయితే.. పాము నిజంగా నాగిని పాటకు నృత్యం చేస్తుందా లేదా అది కేవలం యాదృచ్చికమా? అంటే.. ఎవరి దగ్గరా సమాధానం లేదు.. వాస్తవానికి పాముకు చెవులు ఉండవని.. వినపడదని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.. అయితే.. వీడియోపై స్పష్టమైన సమాచారం లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *