నడిరోడ్డుపై హత్య ఘటన.. బైక్ ఢీకొన్న వివాదంతో గ్యాంగ్‌వార్‌

సాక్షి డిజిటల్ న్యూస్ :భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్ లో వ్యక్తిపై సినీ ఫక్కిలో కత్తులతో దాడి జరిగింది. వైన్స్ షాప్ సమీపంలో ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తుల తలలకు గాయాలు అయ్యాయి. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పాల్వంచకు చెందిని రవిగా గుర్తించారు. అసలేం జరిగిందంటే..భద్రాచలం పట్టణం చర్ల రోడ్ లో కొందరు యువకుల కత్తి పోట్లకు సజ్జ రవి అనే వ్యక్తి మృతి చెందాడు. రాజుపేట కాలని నుండి వస్తున్న ద్విచక్రవాహనానికి మరొక ద్విచక్ర వాహనం తగలడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఘర్షణ వాతావరణం పెరిగింది. ఇరువైపుల యువకుల గ్యాంగ్ వార్ ప్రధాన రహదారిపై అర్ధగంట సేపు పిడిగుద్దుల వర్షం కరిపిస్తూ భీభత్సం సృష్టించారు. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనను సముదాయిస్తున్న సజ్జ రవి అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న యువకులు ఖాలీ సీసాలు, కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా రవి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హాల్చల్ చేసిన యువకుల గ్యాంగ్ వార్ లో గాయపడ్డ మరో నలుగురిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడిలో పాల్గొన్నయువకులను అదుపులోకి తీసుకుని దాడికి దిగిన ఘటనా వివరాలను సేకరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *