వారణాసి ప్రాజెక్ట్‌లో కీలక చేరిక.. జక్కన్న సర్‌ప్రైజ్

సాక్షి డిజిటల్ న్యూస్ :రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై ఇప్పటికే స్కై హై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ సినిమా నుంచి ఇప్పుడో మరో న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ ట్రాటర్‌గా జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో… భారీ స్టార్ క్యాస్ట్ ఉంది. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా చేస్తుండగా,.. విలన్‌గా మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వీరికి తోడు.. జక్కన్న సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా టాక్ వస్తోంది. వారణాసి మూవీలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ యాక్ట్ చేయనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ పాత్ర కోసం చిత్ర బృందం బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించిందని సమాచారం. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *