సాక్షి డిజిటల్ న్యూస్ :ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరగగా.. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నట్టు సమాచారం.