యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా

100 ఫీట్ల వెడల్పు తో యావర్ రోడ్డు ను కమర్షియల్ జోన్ గా మార్చడం జరిగింది

ఇంటిగ్రేటెడ్ స్కూల్,కేంద్రీయ విద్యాలయం,మినీ స్టేడియం నిర్మాణానికి స్థలం మంజూరుకు సీఎం హామీ .

204 కోట్ల తో నిర్మించనున్న హాస్పిటల్ బిల్డింగ్ కు త్వరలో సీఎం,మంత్రుల భూమిపూజ .

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారినీ వారి కార్యాలయం లో కలిసి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

సాక్షి డిజిటల్ డిసెంబర్ 22 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి నీ వారి కార్యాలయం లో కలిసి జగిత్యాల ప్రజల చిరకాల కోరిక యావర్ రోడ్డు విస్తరణ గురించి చర్చించడం జరిగింది.2001 ముందు 80 ఫీట్ ల రహదారి గా యావర్ రోడ్డు ఉంది.
యావర్ రోడ్డు మొదటి నుండి వ్యాపార సముదాయాలు కలిగి అతి తక్కువ నివాస ప్రాంతం కలిగి ఉన్నది.
చాలా ప్రాంతం రెసిడెన్షియల్ పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ గా ఉన్నది .అలాంటి దాన్ని 2021 లో 100 ఫీట్ల రోడ్డు తో కమర్షియల్ జోన్ గా మార్చడం జరిగింది రెసిడెన్షియల్ జోన్ గా మార్చడం వల్ల నేటి నిర్మాణాలు 100 ఫీట్ల వెడల్పు తో జరుగుతున్నాయి.గతంలో 30,50,80 ఫీట్ల పై అనుమతి పొంది నిర్మించిన వాటిని తొలగించాలంటే వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని దీని కోసం రోడ్డు విస్తరణ కు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ని కోరగా వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీదేవి కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు 62.50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు, యావర్ రోడ్డు విస్తరణ కు హామీ ఇచ్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి ని శాలువా తో సత్కరించి ధన్యవాదాలు తెలపడం జరిగింది.జగిత్యాల కు ఇంటిగ్రేటెడ్ స్కూల్,కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది అని ,10 ఎకరాల్లో మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలం సమస్య గా మారిందని,ప్రజల సౌకర్యార్థం చల్గల్ వద్ద వాలంతరీ స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి ని కోరగా స్పందించిన ముఖ్యమంత్రి గారు సెక్రటరీ ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ రాహుల్ బొజ్జ గారితో మాట్లాడి స్థలం కేటాయించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఇట్టి స్థలం విషయం లో గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి కోరడం జరిగింది అన్నారు.ముఖ్యమంత్రి 204 కోట్లు మంజూరు కాగా 135 కోట్ల తో హాస్పిటల్ బిల్డింగ్ కు టెండర్ ప్రక్రియ పూర్తిఅయిందని,భూమిపూజ కార్యక్రమానికి రావాలని కోరడం జరిగింది అని,జనవరి లో భూమిపూజ కార్యక్రమం ఉంటుందని, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీ కూడా తెలియజేయడం జరిగింది అని అన్నారు.యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా అని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *