Header Banner

“సాహసోపేత ఫిట్‌నెస్ స్టంట్.. హైవేపై బ్రిడ్జ్‌లో పుల్‌అప్స్!”

సాక్షి డిజిటల్ న్యూస్ : రీల్స్‌ సరదానో లేక ఫేమస్ అవ్వాలనో ఈ మధ్య కొందరు ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరి ప్రాణాలు పోతున్నా యువతలో ఈ వైరల్‌ పైత్యం మాత్రం తగ్గడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హైవేపై ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ కన్పించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఢిల్లీ లక్నో హైవేపై ఓ రైల్వే వంతెన ఉంది. ఆ రైల్వే వంతెన పైనుంచి ఓ వ్యక్తి వేలాడుతూ కన్పించాడు. కింది నుంచి వాహనాలు వెళ్తుండగా.. వంతెన అంచును పట్టుకొని పుల్ అ‌ప్స్ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియలేదు. అయితే ఆ యువకుడి స్టంట్‌ను నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేసే వారివల్ల వారితో పాటు పక్కవారి ప్రాణాలకు కూడా ముప్పే అని హెచ్చరిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు.