సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుపై ఏర్పడిన అయోమయానికి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తొలుత ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, అనంతరం వాటిని పునరుద్ధరిస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. ఈ వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహం వల్లే తప్పిదం చోటుచేసుకుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.గ్రామపంచాయతీల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ విధానం ఇప్పటికే 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టసవరణ ద్వారా అమల్లోకి తీసుకువచ్చినదేనని గుర్తు చేసింది. తాజా జీవోతో ఆ చట్టసవరణనే పునరుద్ఘాటించినట్లు అధికారులు తెలిపారు.దీంతో గ్రామపంచాయతీల్లో చెక్ పవర్‌పై నెలకొన్న సందేహాలు తొలగినట్లయ్యాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య సమన్వయంతోనే ఆర్థిక లావాదేవీలు జరగాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.