మస్త్ ఫీలుందిగా.. ఫ్రెండ్‌షిప్ మధుర క్షణాలకు సెల్యూట్

సాక్షి డిజిటల్ న్యూస్ :సహజంగా జాతి వైరం ఉన్న మూగ జీవాలు ఎప్పుడూ ఒకదానికొకటి కలుసుకోవు. కానీ అందుకు భిన్నంగా రెండు కుక్కలతో.. ఒక కొండముచ్చు జాతి వైరం మరచి స్నేహంగా ఉంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే మట్టా రాగమయి నివాసం ఉండే విధిలో ఈ మూగ జీవాల స్నేహాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పట్టణంలో కోతుల బెడద నుంచి రక్షణగా ఒక ఇంటి యజమాని కొండముచ్చు తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అయితే, అదే ఇంటిలో రెండు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి.సహజంగా కుక్కలకు, కోతులకు, కొండ ముచ్చులకు జాతి వైరం ఉంటుంది. అలాంటిది ఆ విధిలో ఉండే ఆ మూగజీవాలు మాత్రం అందుకు భిన్నంగా స్నేహాన్ని చాటుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయి. రెండు కుక్కలతో పాటు గా ప్రతి క్షణం వెంట తిరుగుతూ ఒక కొండముచ్చు ఆడుతూ ఉంటుంది. రెండు కుక్కలు సరదాగా ఒకదానిని మరొకటి కొట్టుకోవడం చూసి…ఆ రెండింటి మధ్యలోకి కొండముచ్చు దూరి విడదీస్తుంటుంది..ఇలా సరదాగా కుక్క పిల్లలు, కొండముచ్చు ఆకుకుంటున్నాయి.. అయితే, కుక్క పిల్లలు గొడవపడుతుంటే.. సరదాగా కొండముచ్చు జంపింగ్ లు చేస్తూ ఆటలు ఆడుతుంది. ఈ విచిత్ర దృశ్యాలను స్థానికులు ముచ్చటగా చూస్తూ సెల్ ఫోన్ లో బందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *