సాక్షి డిజిటల్ డిసెంబర్ 29 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
జగిత్యాల మున్సిపల్ అతి పురాతన మున్సిపాలిటీ… యావర్ రోడ్డు ను 60 ఫీట్ ల నుండి 100 ఫీట్ లకు విస్తరణ చేయటం జరిగింది.2021 లో 100 ఫీట్ లకు యావర్ రోడ్డు మాస్టర్ ప్లాన్ చేయటం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి యావర్ రోడ్డు విస్తరణ అతి త్వరలో చేయాలని సభ అధ్యక్షులు ద్వారా కోరారు.జగిత్యాల ఇరిగేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా ప్రాంతం కాబట్టి రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా కాలువల మరమ్మతులు చేపట్టాలని సభలో కోరారు.
జగిత్యాల,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించే ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించి రోల్లవాగు ప్రాజెక్ట్ అటవీ అనుమతులు రాక గేట్ల బిగింపు ఆలస్యం అవుతుంది.ముఖ్యమంత్రి ,ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సభాధ్యాక్షుల ద్వారా కోరారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.