పెట్రోలు పోసి హత్య చేసిన కేసులో 6 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ₹10,000 జరిమాన

కీలక తీర్పును వెలువరించిన ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ట్ సీజన్స్ జడ్జ్ శ్రీ నారాయణ.

నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు

సాక్షి డిజిటల్ డిసెంబర్ 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టర్ అజయ్ :

హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన రాచర్ల పవన్ కుమార్ (40) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులోని ఆశ్రమంలో అతని భార్య మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో, 6 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹10,000 జరిమానా విధిస్తూ గౌరవ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ శ్రీ నారాయణ తీర్పు వెలువరించారు.వివరలోనికి వెళ్తే .. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన రాచర్ల పవన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి సుమారు 11 సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన క్రిష్టవేణితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహానంతరం కుటుంబ కలహాలు తలెత్తి, ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వివాదాలు కొనసాగుతుండేవి.ఈ క్రమంలో క్రిష్టవేణి సోదరుడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ మరణానికి పవన్ కుమారే కారణమని అనుమానించిన క్రిష్టవేణి కుటుంబ సభ్యులు అతనిపై పగ పెంచుకున్నారు.ఈ నేపధ్యంలో,వివాదాలు సర్దుబాటు చేసుకునేందుకు మరియు భార్యను తీసుకువచ్చే ఉద్దేశంతో పవన్ కుమార్ తేదీ 28-11-2020 నాడు హైదరాబాదు నుండి బల్వంతాపూర్ గ్రామ శివారులోని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న అనంతరం, ముందస్తు ప్రణాళిక ప్రకారం అతని భార్య క్రిష్టవేణి, పెద్ద బావమరిది విజయ్, చిన్న బావమరిది భార్య సుమలత, వారి తల్లి ప్రమీలతో పాటు మరికొందరు కలిసి పవన్ కుమార్‌ను ఆశ్రమంలోని ఒక గదిలో బంధించి, పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేయడం జరిగింది.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మల్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కిషోర్ మరియు రమణమూర్తి గార్లు కేసును దర్యాప్తు చేసి ఈ యొక్క హత్య కు పాల్పడిన 7 గురు నిందితులు A1 రాపర్తి సుమలత @ రాపర్తి శ్రీ లక్ష్మి,A3 రాచర్ల కృష్ణవేణి, A4 రాపర్తి ప్రమీల @ రాపర్తి లక్ష్మి,A5 రాందేని స్వరూప,A6 రాపర్తి గంగాభవాని, A7ఉప్పు నిరంజన్ రెడ్డి,( A2 విజయ్ కేసు నమోదు అయన తరువాత చనిపోవడం జరిగింది ) లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈరోజు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మరియు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా, సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన గౌరవ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ శ్రీ నారాయణ నిందితులు పై నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹10,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ … సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన పీపీగా మల్లేశం, దర్యాప్తు అధికారులుగా ఇన్స్పెక్టర్లు కిషోర్ ,రమణమూర్తి, CMS ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ హరీష్ CMS కానిస్టేబుల్ రాజు నాయక్, కిరణ్ కుమార్ లు గౌరవ కోర్టుకు కీలకమైన సాక్ష్యాధారాలను సమర్పించి నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *