
సాక్షి డిజిటల్ న్యూస్,ట్రిపుల్ ఐటీ , ఆగష్టు :07(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల అంజనేయులు)ఫేజ్–ఐ.వి కౌన్సెలింగ్ అనంతరం నాలుగు క్యాంపస్‌లలో మిగిలిన మొత్తం 105 సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు.అయితే, క్రీడా కోటా కింద నాలుగు క్యాంపస్‌లలో మొత్తం 20 సీట్లు (ప్రతి క్యాంపస్‌కు 5 చొప్పున) మినహా మిగిలిన అన్ని సీట్లు ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌తో పూర్తిగా భర్తీ చేయబడ్డాయని తెలిపారు.క్రీడా కోటా సీట్ల భర్తీని శాపం (స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ ) నుండి మెరిట్ జాబితా అందిన వెంటనే, సంబంధిత నిబంధనల ప్రకారం చేపట్టనున్నట్లు ఆర్కె వ్యాలీ పరిపాలనాధికారి వెల్లడించారు.ఈ కార్యక్రమంలోడైరెక్టర్ .ప్రో. జి.విజయ్ ప్రకాశ్, ఆర్కేవిక్యాంపసపరిపాలనాధికారి.డా.రవి కుమార్ , డీన్ అకాడమిక్స్: డి . రమేశ్ కైలాష్,డీన్ స్టూడెంట్ వెల్ఫేర్. డా.జి . వెంకటేష్, రాఘవ రెడ్డి, నవీన్,ప్రొఫీసర్ : డా. తిరుపతి రెడ్డి,వెల్ఫేర్ ఆఫీసర్లు,ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు మరియు అధ్యపకేతర బృందం పాల్గొన్నారు.