మున్సిపాలిటీలో బీజేపీ విజయకేతనం ఎగరవేయాలి

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.

సాక్షి డిజిటల్ జనవరి 12 మండలం పరకాల రమేష్ గొట్టే

పరకాల మున్సిపాలిటీలో బీజేపీ విజయకేతనం ఎగరవేసేలా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ ఎంపీ, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. 22 వార్డులకు గాను 22 వార్డులు బీజేపీ గెలవాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.పరకాల పట్టణంలోని మహాదేవ కన్వెన్షన్ హాల్‌లో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి, డా. సిరంగి సంతోష్ కుమార్, కాచం గురు ప్రసాద్, గుజ్జ సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ పరకాల ప్రాంతం ఎప్పటి నుంచో బీజేపీకి కంచుకోటగా ఉన్నదని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. జిల్లా నాయకత్వం నిత్యం పరకాలలోనే ఉండి ఎన్నికలను పర్యవేక్షిస్తుందని తెలిపారు.వార్డు వారీగా ఇన్‌చార్జుల పర్యవేక్షణ మున్సిపాలిటీ గెలుపుకోసం ప్రతి వార్డుకు ఇన్‌చార్జులు నిరంతరం అక్కడే ఉండి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో బీజేపీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ది పబ్లిసిటీ.. పని తక్కువ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ అని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. గాంధీ పేరును కళంకితం చేసింది డూప్లికేట్ గాంధీలేనని ఎద్దేవా చేశారు.జీ–రాంజీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్టు తెలిపారు. ఆదివాసులకు 150 రోజుల పని కల్పించడం సంతోషకరమన్నారు. గతంలో ఉపాధి హామీ నిధులు ఆరు నెలలకు చెల్లించేవారని, బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే చెల్లిస్తున్నదని చెప్పారు.ప్రతి పైసా ప్రజలకే జీ–రాంజీ నిధులతో కాలువలు, గోదాములు, ఫాం పాండ్లు, ఫిషింగ్, చేనేత, హార్టికల్చర్ వంటి పనులు చేపట్టి గ్రామీణ రైతులకు ఉపయోగపడేలా వినియోగించుకోవాలని కోరారు. మోదీ ఉద్దేశం ప్రతి పైసా ప్రజలకు చేరాలన్నదేనని, 15వ ఫైనాన్స్ నిధులను నేరుగా గ్రామ అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల రాజేందర్ రెడ్డి ఆర్పి జయంత్ లాల్ కొలంనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణాచారి ,సంఘ పురుషోత్తం, ఎర్ర రామన్న ,బాసాని సోమరాజు, మార్త బిక్షపతి, మేకల రాజవీరు, కుక్కల విజయ్ కుమార్ ,దంచనాల కిరణ్, పైండ్ల రంజిత్, గాజుల రంజిత్, వెలిశెట్టి శారద, పావుశెట్టి సునీత, బూత్ అధ్యక్షులు ఆకుల శ్రీధర్, సాదు మధుకర్, ఉపేందర్ రెడ్డి, మరాఠి నర్సింగ్ ,సారంగ నరేష్ ,సంగా నరేష్, తడక విక్రం, బీరం రాజిరెడ్డి ,ఉడుత చిరంజీవి, నరేందర్, దాసరి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, వెల్దండి హేమంత్, ఏకు కృష్ణ, చిద్రికా అశోక్ ,తడక పూర్ణచందర్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *