జర్నలిస్టు పై దాడి ప్రజాస్వామ్యానికి హెచ్చరిక.
జర్నలిస్టు పై దాడి చేయడమంటే రాజ్యాంగం మీద దాడి చేయడమే
.సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 17మార్కాపురం జిల్లా
ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన సాక్షి డిజిటల్ న్యూస్ ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ "షేక్ మక్బూల్ బాష" పట్టణ ప్రధాన కూడలిలో 15 జనవరి 2026 ఉదయం 11:20 గంటల సమయంలో, వార్తా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుపై ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో భౌతిక దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. "సాక్షి డిజిటల్ న్యూస్" కు చెందిన జర్నలిస్టు "షేక్ మక్బూల్ బాష" తన వృత్తి విధులలో భాగంగా రాసిన వార్తపై అసహనం వ్యక్తం చేస్తూ కొంతమంది వ్యక్తులు తనపై దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడి, చివరకు భౌతిక దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ప్రకారం, ఈ సంఘటనలో షేక్ ఇస్మాయిల్ (చికెన్ వ్యాపారి), షేక్ షఫీ (చికెన్ వ్యాపారి), బబ్ల్యూ ( చికెన్ వ్యాపారి), చోటు, ముక్తియార్, సత్తార్ తో పాటు మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశమైన మెయిన్ సెంటర్లో ఈ ఘటన జరగడం వల్ల అనేక మంది ప్రజలు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు.దాడి కారణంగా తనకు ఎడమ చెవి లోపలి భాగంలో తీవ్ర నొప్పి మరియు కుడి పెదవి భాగంలో చీలిక వంటి గాయాలు కలిగినట్లు బాధిత జర్నలిస్టు పేర్కొన్నారు. అనంతరం ఆయన వైద్య పరీక్ష (మెడికల్) చేయించుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసి దీనిని "Attempt Murder" గా పరిగణలోకి తీసుకుని కేస్ నమోదు చేస్తున్నట్లు సమాచారం.మీడియా వర్గాల అభిప్రాయం ప్రకారం, నచ్చని వార్తకు ప్రత్యుత్తరంగా దాడులు చేయడం చట్టవిరుద్ధం. అభ్యంతరాలు ఉంటే న్యాయపరమైన మార్గాలు ఉన్నప్పటికీ, జర్నలిస్టులపై బెదిరింపులు లేదా దాడులు చేయడం భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నంగా పరిగణించబడుతుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల నుండి అందిన సమాచారం మేరకు దాడి చేసిన వ్యక్తులను పురిగొల్పి, జర్నలిస్ట్ పై భౌతికంగా దాడి చేయించడం వెనుక "Autumn Meadow" app మేనేజింగ్ డైరెక్టర్ మరియు అడ్వొకేట్ "అమానుల్లా బాషా", మరియు ఇతని తండ్రి "కమాల్ అహ్మద్"(పోస్ట్ మాన్), అలాగే అన్న "అక్రం బాష" హస్తం ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టుల భద్రతను నిర్ధారించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత మీడియా అనివార్యమని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.