Header Banner

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్బంగా నిరుపేదలకు అన్నదానం

సాక్షి డిజిటల్ జనవరి 18 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని నిరుపేదలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్బంగా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత తన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ధ్వారా సుమారు 100 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా రజిత మాట్లాడుతూ….నిరుపేదల అభ్యున్నతి కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్బంగా 100మందికి అన్నదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మండల అధ్యక్షులు సుంకెట మౌనిక, మహిళా పట్టణ అధ్యక్షులు క్యాతం లావణ్య,జోరిగే శ్రీనివాస్,సురేష్, అమ్మచారిటేబుల్ ట్రస్ట్ పుల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.