సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
గణతంత్ర దినోత్సవ వేడుకలను దీనబంధుకాలనీలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ నాయక్ కాలనీవాసులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహనీయుల త్యాగాల స్మరణ, జాతీయ గీతం నడుమ దేశభక్తి ఉప్పొంగిపోయింది. పెద్దలు, యువత, మహిళలు సహా కాలనీ వాసులంతా పెద్దసంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ నాయక్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ఐక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని సూచించారు. మహేందర్ నాయక్ ముందుచూపు, సేవాభావం, నాయకత్వ లక్షణాలు కాలనీ ప్రజల మనసులను గెలుచుకున్నాయని పలువురు వక్తలు ప్రశంసించారు. కాలనీ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే ఆయన, ఇలాంటి జాతీయ కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజు, రామారావు, శ్రావణ్ కుమార్, రాంబాబు, కే వెంకటేష్, సుదర్శన్, రామ్దాస్, రాంబాబు, శ్రీనివాస్, నవీన్, నరసింహ, దేవేందర్ నాయక్, గంగాధర్, పృధ్విధర్, విశ్వధర్, సత్యనారాయణ రెడ్డి, చంద్ర రెడ్డ, సలీం, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
