Header Banner

అభివృద్ధికి చిరునామాగా కంచి మహేందర్ స్వంత నిధులతో ప్రజాసమస్యకు పరిష్కారం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ఎల్‌బీఎస్ నగర్‌లో కంచి మహేందర్ చొరవతో బోరు ఏర్పాటు ఫతేనగర్, ఎల్‌బీఎస్ నగర్: ఫతేనగర్ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్ ప్రాంతంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కంచి మహేందర్ మరోసారి తన ప్రజాప్రతినిధి బాధ్యతను చాటుకున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కంచి మహేందర్, రైల్వే ట్రాక్ సమీపంలోని ప్రాంతంలో తక్షణమే బోరు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించించారు. ముఖ్యంగా ఈ బోరు పనులను స్వంత ఖర్చులతో నిర్వహించడం ఆయన సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బాలేశ్ తో పాటు ఎల్‌బీఎస్ నగర్‌కు చెందిన పలువురు స్థానికులు పాల్గొని తమ సహకారం అందించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నీటి సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంతో, అక్కడి ప్రజలు కంచి మహేందర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తూ, మాటలకే పరిమితం కాకుండా చర్యల్లో చూపించే నాయకత్వం,కంచి మహేందర్ ని ప్రజలకు మరింత దగ్గర చేస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫతేనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషి,ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.