సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
జగద్గిరిగుట్ట:ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ బి. వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, స్వీట్లు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బి. వెంకటేశం మాట్లాడుతూ…తాను శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల సహకారంతోనే శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీస్ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ నిరంతరం సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న జగద్గిరిగుట్ట పోలీస్ సీఐ సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జీ. నర్సింగ్ రావు, ఎస్. శ్రీధర్ రావు, జి. ప్రసాద్, గణేష్, రాజు, రమేష్ తదితరులు పాల్గొని సీఐ బి. వెంకటేశంకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.జగద్గిరిగుట్ట ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ బి. వెంకటేశంకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరోసారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
