Header Banner

జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సాక్షి డిజిటల్ జనవరీ 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

మంత్రి గారికి బ్రహ్మోత్సవం ఆహ్వాన పత్రిక అందించిన కమిటీ సభ్యులు. వెల్గటూరు మండలం జగదేవ్‌పేట గ్రామంలో నిర్వహించనున్న శ్రీ నగర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావలని ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల విశేషాలను మంత్రి కి వివరించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి కమిటీ సభ్యులు సూచించారు. ఫిబ్రవరి 1వ తేది నుండి ఫిబ్రవరి 3వ తేది వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.