Header Banner

రెండు గ్రామాల అభివృద్ధే లక్ష్యం

సాక్షి డిజిటల్ జనవరి 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

నేరేళ్ల, గోవిందుపల్లె ఉమ్మడి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి,న్యాయవాది జాజాల రమేష్ అన్నారు.గోవిందుపల్లె రోడ్డు. నిర్మాణం కోసం గతంలో డిమాండ్ చేయగా… ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.గోవిందుపల్లె సర్పంచి రాజరపు రాజేశం, ఉపసర్పంచి కోల రాయమల్లు, జాజాల రమేష్ రైతులతో కలిసి జరుగుతున్న పనులను శనివారం పరిశీలించారు. రైతుల పంట పొలాలకు వెళ్లే మార్గాల్లో డ్రైనేజీ సదుపాయం పెంచాలని రైతులు కోరగా..సమస్య పరిష్కారానికి సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నేరేళ్ల, గోవిందుపల్లె గ్రామాల రైతులు మరియు ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.