Header Banner

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం

సాక్షి డిజిటల్ ఫిబ్రవరి 01 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో తేది. 01.02.2026 రోజు ఉదయం 9.30 గం. లకు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీ. బోనగిరి దేవయ్య, SA, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జగిత్యాల, రాష్ట్ర కార్యదర్శి - తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయుల సంఘం(TPUS - TAPAS)గారు పూల మాలతో నివాళ్లు అర్పించి సేవలను స్మరించారు.అంబేద్కర్ గారు దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు. అంబేద్కర్ గారి గురించి విస్తృతంగా తెలుసుకొనుటకు స్వచ్చందంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమం అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ…. భారత దేశ భవిష్యత్ ముఖ చిత్రాన్ని రాజ్యాంగం ద్వారా బాబా సాహెబ్ గారు ఆవిష్కరించారాని అన్నారు. స్వతంత్ర భారతవానికి బడుగు బలహీన వర్గాలు, రాజకీయ, పౌర హక్కులు, రక్షణలు అన్ని సమగ్రంగా పొందుపరిచారాని పేర్కొన్నారు. అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా లాంటి దేశాల్లో తీవ్రమైన రాజకీయ అనిచ్చితి ఉన్నా మనం దేశంలో బలమైన సమాఖ్య వ్యవస్థను దూర దృష్టితో ఏర్పారచారని అన్నారు. అంబేద్కర్ గారు బహుజనులు, దళిత, సబ్బండా వర్గాలకు జాతి నాయకుడు అని కొనియాడారు. కార్యక్రమం నిర్వాహకులు నల్ల శ్యామ్ కి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియాఅంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల నారాయణ పెన్షనర్ సంఘం జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి కంటి అంజయ్య తెలంగాణ శక్తి ఎడిటర్ అనంతల కాంతారావు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు ధూమాల గంగారం సుంకరపల్లి అశోక్ నల్ల సురేష్ మాజీ సర్పంచ్ దాసరి లచ్చయ్య దాసరి ప్రవీణ్ రాగం రమేష్ కలబండ వెంకటి ఎస్ రాజేందర్ పడేగల లక్ష్మణ్ అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి గజ్జల రాజు బొల్లం ప్రభాకర్ సురేష్ బిట్ల ప్రకాష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు